ఓ వ్యక్తి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను చంపిన సంఘటన పంజాబ్‌లో లూధియానా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:

రెండు సంవత్సరాల క్రితం మహమూద్ రివాని (33) అనే వ్యక్తి షకీల్ బిబిని(30) పెళ్లి చేసుకున్నాడు. నెల క్రితం నుంచి దంపతులు ఝార్ఖండ్ నుంచి వచ్చి లూధియానాలోని ధాంధ్రాన్ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ మధ్యలో ఓ మహిళను రివాని తన ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో రివాని, బిబి మధ్య గొడవలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. మహిళ బంధువులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. మే 7న బిబి మృతదేహం బావిలో కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం. ఆమె భర్త రివాని ఘటనా స్థలంలో లేకపోవడంతో అతడినే పోలీసులు నిందితుడిగా భావిస్తున్నారు. పోలీసులు రివాని మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోలీస్ అధికారి సుఖ్‌దేవ్ సింగ్ తెలిపాడు.

భర్త తన భార్యను గొంతు నులిమి చంపాడా? లేక ఆమెకు పాయిజన్ ఇచ్చి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఐపిసి 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిబిని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.