అతడో స్కూల్ టీచర్, చంద్రపూర్ జిలాలోని ఓ చిన్న స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఒకరికి 16 ఏళ్లు, మరోకరికి 14. భార్య అనారోగ్యం కారణంగా గత కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైంది. ఇటువంటి సమయంలో ఒక తండ్రిగా పిల్లలకు అన్నీ తానై అండగా నిలవాల్సిన అతడు వారిపైనే కన్నేశాడు. గత ఐదేళ్లుగా వారిపై అత్యాచారాని పాల్పడ్డాడు. రక్తం పంచుకు పుట్టిన పిల్లలన్న కనికరం కూడా చూపించలేదు. ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించటంతో ఆ చిన్నారులకు బిక్కుబిక్కుమంటూ ఇంత కాలంగా నరకం చూశారు. చివరకు ఒక రోజు ధైర్యం కూడదీసుకుని మేనమామకు జరుగుతున్న దారుణాన్ని చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం అతడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు….