భావితరాల కోసం మనమంతా ఏకమై హరితహారంలో మొక్కలు నాటాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. రూరల్‌ జిల్లా మరియపురంలోని ఆర్యవైశ్య గోల్డెన్‌ సిటీలో ఆదివారం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మె ల్యే.. గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. మనం నాటే మొక్కలు భావితరాలకు కావాల్సినంత ఆక్సిజన్‌ను అందిస్తాయని ధర్మారెడ్డి అన్నారు. గ్రామాల్లో మొక్కలను కాపాడే బాధ్యతను అందరూ తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటి రక్షించాలని సూచించారు.

ఈజీఎస్‌ అధికారులు గ్రామాల్లో మంకీ ఫుడ్‌కోర్టులో అత్యధికంగా పండ్ల మొక్కలు నాటించాలని ఆదేశించారు. మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో హరితహారాన్ని సీఎం కేసీఆర్‌ యజ్ఞంలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమేలా సత్పతి, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్‌లు మల్లారెడ్డి, ప్రకాశ్‌, కుడా డైరెక్టర్‌ వీరగోని రాజ్‌కుమార్‌, రాజేందర్‌, సీతారాం, ఎంపీటీసీ వీరరావు, నాయకులు తోట సంపత్‌, ధనుంజయ, చిన్ని, జాగృతి నాయకులు శ్రీకాంత్‌, ప్రమోద్‌, సంపత్‌ పాల్గొన్నారు.