సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి ఎస్ఐ నిహారిక అన్నారు. కరోణ విజృంభిస్తున్న నేపథ్యంలోసోషల్ మీడియా వాట్సప్ గ్రూపులలో కరోనా సోకిన వ్యక్తిపేరు ఫోటో అడ్రస్ వ్యక్తిగత వివరాలు షేర్ చేయడం నిషేధం కావున అలా ఎవరైనా గ్రూప్ లలో షేర్ చేస్తే షేర్ చేసిన వ్యక్తికి మరియు గ్రూప్ అడ్మిన్ కు మూడు నెలల జైలు శిక్ష ఉంటుందన్నారు. కావున మండల ప్రజలు సోషల్ మీడియాలో ఏలాంటి అసత్య ప్రచారాలు చేయకూడదని ఆమె సూచించారు.