తెలంగాణ రాష్ట్ర మంత్రి,అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రిగా రెండో సారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్న వరంగల్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 5 తారీఖున మంత్రి కేటీ రామారావు వరంగల్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ వరంగల్ భద్రకాళి బండును ప్రారంభిస్తారు. దీంతో పాటుగా హన్మకొండ వేయి స్థంభాల ఆలయ ప్రాంగణం, జైన్ మందిరం, పద్మాక్షి దేవాలయాలను కూడా మంత్రి KT రామారావు ప్రారంభిస్తారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో వరంగల్ నగరాభివృద్ధిపై మంత్రి కేటీ రామారావు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు…