హిందు ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఈ రోజు వరంగల్ మహానగరంలోని మడికొండలో కొలువై ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి వారికి ఆలయ అధికారులు అర్చకులు భక్తులు ఘాన స్వాగతం పలికారు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలుకగా స్వామి వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి పంచామృతలో అభిషేకం నిర్వహించారు,

శ్రీ సీత రాములను మరియు గుట్ట పైన నిర్మాణంలో ఉన్న సరస్వతి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,అంతే కాకుండా ఆలయ భక్తులకు హిందు ధర్మశాస్రం యొక్క గొప్పతనాన్ని తన ప్రవచనాలను భక్తులకు బోధించారు, అదే విదంగా దంపతులకు పాద పూజ కార్యక్రమాలు నిర్వహించి దంపతులను దీవించారు.

కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అభిలాష్ శర్మ, విష్ణు, సత్యనారాయణ, ఆలయ ఈ.ఓ వీర స్వామి , తెరాస సీనియర్ నాయకులు అవాల రాధిక రెడ్డి, వెంకటేశ్వర్లు, ఆలయ చైర్మన్ అల్లం శ్రీనివాస్, స్థానిక 33 వ డివిజన్ కార్పొరేటర్ తొట్ల రాజు మరియు స్వామి వారి ప్రచార సమన్వయ కర్తలు రాంమూర్తి పోలపల్లి, గాడిచర్ల శ్రీకాంత్ రెడ్డి, రోహిత్, తిరుపతి తదితర భక్తులు పాల్గొన్నారు.