మారణాయుదాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్, మడికొండ సివిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపి చక్రవర్తి మడికొండ పొలిస్ స్టేషన్ లో మీడియ ముందు ప్రవేశపెట్టారు.

జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, పక్క సమాచారంతో ముఠాను పట్టుకొని అరెస్ట్ చేశామని టాస్క్ పోర్ అడిషనల్ డిసిపి చక్రవర్తి తెలిపారు. గతంలో నిషేదిత మావోయిస్టు పార్టీలో పనిచేసి అరెస్ట్ అయిన తర్వాత బేయిల్ పై విడుదల అయిన తేలకుంట్ల బిక్షపతి ఇందులో ప్రదాన నిందితుడిగా పోలీసులు తెలిపారు.

వీరి వద్ద నుండి మూడు నాటు తుపాకులు, రెండు ఆటోలు, ఒక బైక్, సెల్‌ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.