మహారాష్ట్రలోని వాశాయి ప్రాంతంలో మతి స్థిమితం లేని మహిళపై ఓ పాస్టర్ అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:. హిప్నాటిజంతో మానసిక రోగులను బాగు చేస్తానని ఓ పాస్టర్ (45) ప్రార్థనా మందిరాన్ని నెలకొల్పాడు. మానసిక వ్యాధితో బాధపడుతున్న 21 ఏళ్ల మహిళను పాస్టర్ వద్దకు తీసుకొచ్చి ప్రార్థనలు చేయించుకునేవారు కుటుంబ సభ్యులు.

మహిళను ప్రార్థన మందిరంలోకి తీసుకెళ్లి ప్రార్థన చేసి ఆమె నుదిటిపై పాస్టర్ ఆయిల్ రాసేవాడు. అనంతరం ప్రార్థన చేసినందుకు డబ్బులు కూడా తీసుకున్నాడు. గత సంవత్సరం నుంచి మహిళ ప్రార్థన మందిరానికి వస్తూనే ఉంది. ప్రార్థన మందిరంలోనే సదరు మహిళను విడిచి వెళ్లాలనని కుటుంబ సభ్యులకు పాస్టర్ సూచించారు. మానసిక స్థితి బాగోలేని సదరు మహిళను పాస్టర్ బయటకు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు.

బాధితురాలు మాత్రం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. మహిళను పాస్టర్ బయటకు తీసుకెళ్లినప్పుడు కుటుంబ సభ్యులకు తెలిసిన వారు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఉన్న ప్రాంతానికి చేరుకొగానే పాస్టరు తప్పించుకొని పారిపోయాడు. వెంటనే బాధితురాలిని తీసుకొని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.