ఈ రోజు తేది:26.11.2019 నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారి ఆదేశానుసారం మెదక్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ యెస్.ఐ శ్రీ సందీప్ రెడ్డి గారు జిల్లాలో గత కొద్ది రోజుల క్రితం నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ కార్యక్రమం లో తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వ్యక్తులకు తాగి వాహనాలు నడిపడం వల్ల జరిగే అనర్దాల గురించి కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా పట్టుబడిన వ్యక్తులకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వారి తల్లితండ్రుల, లేదా కుటుంభ పెద్దల సమక్షంలో కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరిగుతుందని తెలిపినారు. అలాగే వారికి ట్రాఫ్ఫిక్ నియమ నిభందనలను గురించి అనగా డ్రంక్ & డ్రైవ్, ట్రిపుల్ రైడ్, పెండింగ్ ఈ చాలాన్స్, హెల్మెట్ ప్రాముక్యత ,డ్రైవింగ్ లైసెన్స్, ఓవర్లోడ్ ప్యాసింజర్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, సెల్ ఫోన్ డ్రైవ్, సీట్ బెల్ట్, ఇన్సూరెన్స్ వాహన పత్రాలు మొదలైన వాటిని గురించి వివరించి , గతంలో జరిగిన సంఘటనలపైన వీడియోలు చూపించి వారికి అవగాహన కల్పించడం జరిగింది.

వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి వాహానానికి సంబందించిన పూర్తి దృవ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. ఈ సంధర్భంగా యెస్.ఐ శ్రీ సందీప్ రెడ్డి గారు మాట్లాడుతు: పోలీసులు వాహన తనిఖీలు ప్రజల క్షేమం కోసమే నిర్వహిస్తారని మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోయి, వారివారి కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాలకు ముప్పని, రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని అన్నారు. అదేవిధంగా రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫ్ఫిక్ నియమ నిభందనలను పాటించాలని, వీటిని పాటించడం వలన క్షేమంగా తమ తమ గమ్యాలకు చేరుకోవచ్చని అన్నారు.

అలాగే వాహనం నడిపే వ్యక్తులు తమతమ కుటుంభ సబ్యులను గుర్తుపెట్టుకుని వాహనాలు నడపాలని, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు, బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు ఇటువంటి తప్పులు చేయకుండా కుటుంబ పెద్దగా క్రమశిక్షణతో ఉండాలని, తమపై ఆధారపడిన భార్యాపిల్లలు, కుటుంభ బాధ్యతలు ఉన్నవారు అర్థం చేసుకుని, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేయకుండా, క్రమశిక్షణతో జీవితాన్ని కొనసాగించాలని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రతి పోలీస్టేషన్ పరిధిలో రోజు డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తారని ఈ డ్రంకన్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన వారికి జిల్లా కేంద్రంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తర్వాత వారిని కోర్టుకి హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిర కోర్ సబ్యులు సతీష్ గారు పాల్గొన్నారు.