నల్లకుంట సమీపం లో బోనాల జాతర లో భాగంగా ఊరేగింపు నిర్వహించారు డప్పు వాయిద్యా లతో సందడి వాతావరణం కనిపించింది. స్థానిక యువకులంతా తీన్మార్ స్టెప్పు లతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పక్కనే నల్లకుంట ఎస్సై మహేంధర్ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కానిస్టేబుళ్ల తో కలిసి భద్రత ను పర్యవేక్షిస్తున్నారు. ఎస్సై మహేంధర్ యువకులు డ్యాన్స్ చేస్తున్న సమయంలో అటుగా వెళ్లారు. ఎస్సై అటుగా రావడాన్ని గమనించిన ఓ యువకుడు ఆయన పట్టుకు ని గట్టి గా ముద్దు పెట్టాడు. ఈ హఠాత్ పరిణామం తో షాక్ తిన్న ఎస్సై మహేంధర్ యువకుడు చెంపచెళ్లు మనిపించాడు కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సీన్ మొత్తాన్ని దగ్గర్ లో ఉన్న మరో వ్యక్తి మొబైల్ లో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఎస్సై ని ముద్దు పెట్టిన యువకుడు మద్యం మత్తు లో ఉన్నట్టు తెలుస్తోంది.