లాక్ డౌన్ టెన్షన్ భరించలేకున్నాము:

లాక్ డౌన్ టెన్షన్ భరించలేకున్నాము.. తప్పదని తెలుసు , అయినా కొంత రిలీఫ్ కావాలి అందుకు రెండు పెగ్గులైనా మందు వేసుకోవాలికదా..?అంటూ బాలీవుడ్‌ సినియర్‌ నటుడు రిషి కపూర్‌ ఆవేదన వ్యక్తం చేసాడు. ప్రతి రోజు సాయంత్రం లిక్కర్‌ షాపులు తెరవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుండి డ‌బ్బు అవ‌స‌రం. అందుకోసం కొంత కాలం లైసెన్స్ పొందిన మ‌ద్యం దుకాణాల‌ని సాయంత్రం స‌మ‌యంలో తెర‌వాలి. ఈ విష‌యంలో న‌న్ను తప్పుగా అర్థం చేసుకొని తిట్టొద్దు. మనిషి ఇంట్లో అనిశ్చితి, నిరాశతో ఉంటాడు. ఇలాంటి సమయంలో పోలీసులు, వైద్యులు, పౌరులకి మద్యం అవసరం. బ్లాక్‌లో అయిన మద్యం అమ్మే ఏర్పాట్లు చేయండి’ అని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.