వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని తాళ్లకుంట తండాలో దారుణం చోటు చేసుకుంది. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకర్ నిర్మాణం వద్ద జరిగిన గొడవలో తల్లిదండ్రులు లేని సమయంలో వాకుడోత్. మహేశ్వరి(15) అనే బాలికను బాబులాల్ అతడి భార్య ప్రమీల కలిసి చితకబాదారు. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన మహేశ్వరి తల్లితండ్రులు ఇంట్లో లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.స్థానిక పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న మహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో, బాలిక తల్లిదండ్రులు, తండావాసులు విషాదంలో మునిగిపోయారు…