వరంగల్ సిటీలోని స్టార్ హోటళ్లపై గ్రేటర్ ఆఫీసర్లు బుధవారం దాడులు నిర్వహించారు . హోటళ్లలోని ఫుడ్ మాంసాన్ని తనిఖీ చేశారు . ఆకస్మికంగా చేసిన ఈ దాడులతో మటన్ , చికెన్ నిల్వలు బయటపడ్డాయి . రెగ్యులర్ గా తనిఖీ చేపట్టకపోవడంతో హోటళ్ల యజమానులు విచ్చలవిడిగా ఒకటి రెండు రోజులు నిల్వఉంచిన మాంసాన్ని వినియోగదారులకు వండివారుస్తున్నారు . దీంతో జనాలు అనారోగ్యం పాలవుతున్నారు . ఇంత జరుగుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవట్లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి తాజా దాడులతో పాటు మాంసం నిల్వలను గుర్తించడమే కాకుండా వారికి ఫైన్లు విధించడంపై జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు . ఆకస్మిక తనిఖీలు సిటీలోని పలు హోటళ్లపై గ్రేటర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్ స్పెక్టర్ రాజేందర్ , ఇతర ఆఫీసర్లు ఆకస్మిక దాడులు నిర్వహించారు . వండిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టడాన్ని గుర్తించి హోటళ్ల యజమానులకు ఫైన్లు విధించారు . వండిన మాంసం , ఆహార శాంపిల్స్ ను లాబరేటరీకి పంపించారు . ఈ సందర్భంగా హోటళ్లలో నిషేధించిన ప్లాస్టిక్ కవర్ల వినియోగం గుర్తించారు . 120 కిలోల కవర్లను స్వాధీనం చేసుకున్నారు . ఇందులో హన్మకొండలోని ల్యాండ్ మార్క్ హోటల్ కు రూ . 40 వేలు గ్రీన్ పార్క్ హోటల్ కు, రూ . 30వేలు , వరంగల్ హోటల్ రత్నా గ్రాండ్ కు రూ . 10 వేలు మాస్టర్ చెఫ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు రూ . 3 వేలు ఫైన్ విధించినట్లు ఆఫీసర్ లు వివరించారు . ఈ తనిఖీల్లో శానిటరీ సూపర్ వైజర్ సుధాకర్ , శానిటరీ ఇన్ స్పెక్టర్లు గోల్కొండ శ్రీనివాస్ , రవీందర్ , అనిల్ , జవాన్లు తదితరులు పాల్గొన్నారు …