ఆకస్మికంగా మరణించిన పోలీస్ సిబ్బంది. కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆకస్మికంగా మరణించిన పోలీస్ కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యులకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా సోమవారం అర్థిక సాయాన్ని అందజేసారు. గుండాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తు గత సంవత్సరం జనవరి మాసంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ సి.హెచ్ శంకర్ తల్లి లక్ష్మమ్మ, భార్య సంతోషిలకు యాక్సిడెంటల్ భీమా క్రింద మంజూరైన 8లక్షల రూపాయల చెక్కులను అందజేయగా, గత మే మాసంలో ఆనారోగ్య కారణాలతో మరణించిన కానిస్టేబుల్ మల్లేషం కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేయడంలో భాగంగా చేయూత పథకం ద్వారా మరణించిన కానిస్టేబుల్ భార్య అనసూయకు లక్షన్నర రూపాయల ఆర్థిక సాయాన్ని పోలీస్ కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ ప్రస్తుత స్థితిగతులను పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల అశోక్ కుమార్ గౌడను అడిగితెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వపరంగా అందాల్సిన బెనిఫిట్లను తక్షణమే అందజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ అదేశించారు.