ఓ వ్యక్తి తన భార్య చెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భవతి అని తెలియడంతో భార్యకు తెలియకుండా మరదలిని లేపుకుపోయాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని గిదా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు: మాల్వాకు చెందిన కరణ్ నాథ్‌కు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. అతడు తన భార్య, ఆమె తల్లిదండ్రులతో కలిసి రాజస్తాన్‌లోని మండాలిలో నివసిస్తున్నాడు. ఇక, అత్తమామల ఇంట్లోనే ఉంటున్న కరణ్ కన్ను తన భార్య చెల్లెలిపై పడింది. ఆమె మైనర్ అని చూడకుండా కరణ్ ఆమెపై అత్యాచారాని పాల్పడ్డారు. అయితే అత్యాచారానికి గురైన కరణ్ మరదలు గర్భవతి అని తేలింది. దీంతో ఈ విషయాన్ని ఆమె కరణ్‌కు చెప్పింది. దీంతో కరణ్ తన మరదలికి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇలా నమ్మించి ఆమెను ఇంట్లో నుంచి లేపుకుని పోయాడు. దీంతో ఆమెను రాజస్తాన్ నుంచి పుణెకు తీసుకెళ్లాడు. గతంలో పుణెలో పనిచేయడంతో కరణ్‌కు అక్కడ కొందరితో పరిచయాలు ఉన్నాయి. దీంతో అక్కడ ఓ రూమ్ రెంట్‌కు తీసుకుని తన మరదలితో కలిసి ఉంటున్నాడు.

ఈ ఘటనకు సంబంధించి కరణ్అత్తమామలు నెలరోజుల క్రితం గిదా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుడు సెల్‌ఫోన్ సిగ్నల్‌ను ట్రేస్ చేశారు. ఆ మైనర్ బాలిక పుణెలో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే కరణ్ మాత్రం తప్పించుకుని పారిపోయాడు. బాలిక ఇంటికి చేరుకున్నాక ఆమె గర్భవతి అనే విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కరణ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పొస్కోచట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే మైనర్ బాలిక స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా నిందితుడు కరణ్ తనను రేప్ చేసినట్టు బాలిక వెల్లడించింది. అతడు తనను పుణె తీసుకెళ్లి బంధించినట్టు తెలిపింది.