గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్సకు 50వేల ఆర్థిక సహాయం. హసనపర్తి మండలం ఆనంతసాగర్ గ్రామానికి చెందిన కొమ్ముల సదానందం గారి కుమారుడు కొమ్ముల సాత్విక్ (6సం.) గుండె సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు సాత్విక్ చికిత్స కోసం 50,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంతసాగర్ గ్రామ సర్పంచ్ బండ జీవన్ రెడ్డి, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.