లాక్ డౌన్ కు ముందు కువైట్ కి వెళ్లి రెండు నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన వరంగల్ వాసులను వారి స్వస్థలాలకు రప్పించేందుకు కృషి చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వారు వరంగల్ వచ్చేలా చర్యలు తీసుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా లోని హన్మకొండ 41 వ డివిజన్ కి చెందిన ఎస్ . డి ఫసియోద్ధిన్ (సమద్ ) రెండు నెలల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి కువైట్ వెళ్లారు. వారు వెళ్ళిన కొద్ది రోజులకే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో అక్కడ ఏ పనిచేసుకోలేక స్వదేశానికి వెళ్లేందుకు డబ్బులు లేక దయనీయ జీవితం గడుపుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఇటీవలే ‘ వందే భారత్ మిషన్’ను చేపట్టింది.

ఈ మిషన్ తొలి దశలో భాగంగా 6 విమానాలను దుబాయ్ నుండి హైదరాబాద్ కి ఏర్పాటు చేసింది . ఈ నేపథ్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన సమాద్ తనకు స్వదేశం వచ్చేలా సాయం చేయాలని వందే భారత్ మిషన్ లో ఏర్పాటు చేసిన విమానాల్లో తమను స్వదేశానికి చేర్చెలా చొరవ తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు ఫోన్ ద్వారా అభ్యర్థించారు. వెంటనే స్పందించిన వినయ్ భాస్కర్ హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ని కలిసి గత రెండు నెలలుగా కువైట్ లో ఇరుక్కుపోయిన సమద్ ని స్వదేశానికి రప్పించడానికి సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

వినయ్ భాస్కర్ విజ్ఞప్తికి స్పందించిన కేటీఆర్ కువైట్ లో ఇరుక్కున్న వారు త్వరగా స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారులకు సూచించారు. కేటీఆర్ కార్యాలయ అధికారులు కువైట్ లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి మరో మూడు రోజుల్లో రానున్న విమానాల్లో వారు భారతదేశం వచ్చే విధంగా ఏర్పాటు చేశారు .ఈ నేపద్యంలో గురువారం హన్మకొండ లోని సమద్ ఇంటికి స్వయంగా వెళ్లి సమధ్ తండ్రి అహ్మద్ హుస్సేన్ కు దాస్యం వినయ్ భాస్కర్ 30 ,000 రూపాయలను అందజేశారు . సమస్య గురించి చెప్పగానే పరిష్కారానికి కృషి చేసి ఆర్థిక సహకారం అందజేసిన దాస్యం వినయ్ భాస్కర్ కు సమద్ తండ్రి అహ్మద్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలియజేశారు.