నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష పడ్డ తర్వాతనైనా మానవ మృగాలలో మార్పు రావడం లేదు. తాజాగా హన్మకొండ ప్రవీణ్‌ మాదిరే ఓ యువకుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్‌ లో జరిగింది.

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రేగొంఢి గ్రామానికి చెందిన నగేష్ (22) తన ఇంట్లో ఎవరు లేని సమయంలో పక్కింటికి చెందిన ఐదేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేశాడు. పాపకు తీవ్ర జృరం రావడంతో తల్లిదండ్రులు హస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇంతలో చిన్నారి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పెద్దేముల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల కోసం తాండూర్ లోని జిల్లా హస్పిటల్ కి తరలించారు. సంఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని నగేష్ 22 అదుపులోకి తీసుకున్నారు. నిందుతుడు నగేష్ చిన్నారికి వరుసకు మామ అవుతాడని తెలిపిన పోలీసులు పూర్తి వివరాలపై విచారణ జరుపుతున్నారు.