హనుమకొండ: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన పండ్లు మరియు స్వీట్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకరరావు తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి తిరంగ బెలూన్లు ఎగురవేసి, మొక్కలు నాటి, పండ్లు & స్వీట్లు పంపిణీ చేసారు. అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూః  స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని మనోవికాస ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు.

21 సంవత్సరాల నుండి వందలాది మందిని చేరదీసి వారిలో అప్యాయత, అనురాగాలను పంచుతూ కన్నబిడ్డల్లాగా సాకుతున్న మనో వికాస కేంద్రం నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశభక్తి గీతంపై ప్రత్యేక నృత్యం చేసిన మనోవికాస కేంద్రం చిన్నారులను ఆశీర్వదించి వారికి తర్ఫీదు ఇచ్చిన శిక్షకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్,జిల్లా సంక్షేమ,చైల్ వెల్ఫేర్ అధికారులు మరియు ఆశ్రమ నిర్వహకురాలు రామలీల తదితరులు పాల్గొన్నారు..