టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వీకే నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రేమాయణంపై ఏకంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘మళ్లీ పెళ్లి’ పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించనుండగా నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్‌ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ టీజర్‌లో చివర్లో వచ్చే కన్నుకొట్టే సీన్‌ నెటిజన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం పవిత్ర లోకేష్, నరేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ టీజర్ వైరల్‌గా మారింది. అయితే ఈ టీజర్‌పై కొందరు నెటిజన్స్‌ దారుణ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇలాంటి సినిమాలు మరిన్నీ రావాలని పోస్టులు పెడుతున్నారు.

మరికొందరు ఈ సినిమాను రాంగోపాల్ వర్మ తీసుంటే ఇంకా బాగుండేదని సలహాలు కూడా ఇస్తున్నారు. ఓ నెటిజన్‌ ‘మళ్లీ శోభనం’ ఎప్పుడు రిలీజ్‌ అంటూ కామెంట్ చేశాడు. కాగా లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన‍్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.