తెలుగు ప్రేక్షకులకు అమ్మగా అత్తగా సుపరిచితం అయిన నటి పవిత్ర ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తుంది. డాన్స్ చేస్తూ లేదంటే వర్కౌట్స్ చేస్తూ ఈమె నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. సినిమాల్లో చాలా పెద్ద వయసు ఆంటీగా కనిపించే ప్రగతి వయసు మామూలుగా అయితే తక్కువే ఉంటుంది. ఆమె చేసిన పాత్రల కారణంగా ఆమెను అంతా ఆంటీ అనేస్తున్నారు. తన ఫిట్ నెస్ ను నిరూపించుకునేందుకు సోషల్ మీడియాలో ఈమె వర్కౌట్ వీడియోలు మరియు ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా మరో సారి ప్రగతి తన వర్కౌట్ ఫొటోలను షేర్ చేసింది. ఈసారి మరింత ఎక్కువగా కష్టపడ్డట్లుగా అనిపిస్తుంది. చెమటలు కార్చి మరీ వర్కౌట్స్ చేసింది. కష్టపడి వర్కౌట్స్ చేయడం వల్ల ప్రగతి మొహం ఎరుపెక్కింది. చెమటలు కారిపోతున్నాయి. ఫిట్ నెస్ కోసం ఆమె పడుతున్న కష్టం నలుగురికి ఆదర్శంగా ఉందంటున్నారు. ఈ ఫొటోలతో పాటు ప్రగతి లక్ష్యంను ఎప్పుడు తగ్గించుకోవద్దని దాన్ని సాధించేందుకు ఎక్కువ కష్టపడాలంటూ సలహా ఇచ్చింది.