జూబ్లీహిల్స్ కేంద్రంగా సాగుతోన్న ఆన్‌లైన్‌ వ్యభిచార రాకెట్‌ గుట్టును జూబ్లీహిల్స్‌ పోలీసులు రట్టు చేశారు. మసాజ్‌ సెంటర్‌ ముసుగులో ఓ అపార్టుమెంట్‌లో వేశ్య గృహాన్ని నడుపుతున్నట్లు గుర్తించారు. ఆ అపార్టుమెంట్‌పై దాడి చేసి నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరు విటులను అరెస్టు చేశారు.

జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలోని నెంబర్‌ 25లో ఓ అపార్టుమెంట్‌లో అవని వెల్నెస్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్‌ను శైలజ అనే మహిళ నడుపుతోంది. అక్కడికి వచ్చే మహిళలకు పురుషులను ఆమె సప్లై చేస్తోంది. అలాగే పురుషులను ఆకర్షించేందుకు లోకాంటో వెబ్ సైట్ లో మహిళల ఫోటోలు ఫోటో పోస్ట్ చేస్తోంది శైలజ. భర్త పరమేశ్వర్ తో కలిసి ఇలా ఆన్లైన్ సెక్స్ బిజినెస్ చేస్తూ లాక్ డౌన్ సమయంలోనూ లక్షలు సంపాదించింది శైలజ. నార్త్ ఇండియా నుంచి కూడా అమ్మాయిల తీసుకువచ్చి శైలజ వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ సెంటర్‌ పై దాడి చేసి నిర్వాహకురాలు శైలజతో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు జూబ్లీహిల్స్‌ పోలీసులు.

ఉపాధి అవకాశాలు లేక:

ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. తాజా వ్యవహారంలోనూ ప్రధాన నిర్వాహకుడు సంపాదన లేకపోవడంతోనే ఈ మార్గంలోకి వచ్చినట్లు పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు. ఒకే చోట ఉంటే స్థానికులకు అనుమానం వచ్చే అవకాశం ఉందని భావించే ఈ ముఠాలు తరచూ అడ్డాలు మారుస్తుంటాయి. ఒక్కోచోట కొన్ని రోజుల పాటు ఇల్లు అద్దెకు తీసుకుని దందా సాగించి, మరో ప్రాంతానికి మకాం మార్చేస్తాయి. ఇటీవల చిక్కిన ముఠా కూడా అడ్డాలు మారుస్తూ చివరకు మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధిలో చిక్కింది. విటుల నుంచి ఫోన్‌ వస్తే వారి వద్దకే ఆటోల్లో యువతులను సరఫరా చేస్తుంటారు. ఓ చెయిన్‌గా మారిన ఈ వ్యవహారంలో కొందరు చిక్కినప్పటికీ, చాలా మంది తప్పించుకుంటూనే ఉంటారు.