‘నేను ఏజెంట్‌ చేతిలో మోసపోయా ఆరోగ్యం కూడా క్షీణించింది. నన్ను భారత్‌కు రప్పించేలా చర్యలు చేపట్టండి’ అంటూ ఎర్రావారి పాళెం మండలం బోడ వాండ్లపల్లెకి చెందిన సులోచన(38) కుటుంబ సభ్యులకు మంగళవారం మస్కట్‌ నుంచి సెల్ఫీ వీడియో పంపింది. తనను అనుకున్నచోట పనిలో పెట్టలేదని వాపోయింది. స్వదేశానికి తీసుకెళ్లాలని ఏజెంట్‌ను బతిమలాడినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తనను భారత్‌కు పిలిపించుకోవాలని కుటుంబ సభ్యులను వేడుకుంది.