ఉపముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకారం..

మహారాష్ట్రలో శరద్ పవర్ మేనల్లుడు అజిత్ పవర్ చక్రం తిప్పారు. గంటకు ఒక మాట మర్చి చివరకు శివసేనను జోకర్ ను చేసి బీజేపీని గద్దెనెక్కించాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అనూహ్య పరిస్థితుల్లో బీజేపీ నేత ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన శరద్ పవర్ మేనల్లుడు అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు.

గతరాత్రి ఒంటిగంట వరకూ శివసేనకు మద్దతిస్తామని శరద్ పవర్ చెప్పారు. అనూహ్యంగా అజిత్ పవార్ రూటు మార్చి బీజేపీకి అనుకూలమయ్యారు. శరద్ పవార్ మాటలు నమ్మిన శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఆఖరికి ఆయను సీఎం అభ్యర్థిగా కూడా శరద్ పవార్ ప్రకటించేశాడు. అయితే రాత్రి ఒంటిగంట తర్వాత రాజకీయం మారింది. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీతో మిలాఖత్ అయ్యారు.

ఉదయానికి బీజేపీకి మద్దతిస్తున్నామని ప్రకటించి గంటలోపే మహారాష్ట్ర రాజకీయాలను తల్లక్రిందులు చేసి బీజేపీని గద్దెనెక్కించారు. ఇదేమని శరద్ పవార్ ను అడిగితే ఆ విషయాలు తనకెవీ తెలియవని ఉదయాన్నే అందరిలాగే తనకూ ఈ విషయాలు తెలిశాయని చెప్పారు. బీజేపీకి మద్దతివ్వడం తమ పార్టీ నిర్ణయం కాదని అజిత్ పవార్ సొంతంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు…