• GWMC మేయర్ ఆధ్వర్యంలో టెక్స్టైల్ నిపుణులచే ఎస్.హెచ్.జీ. మహిళలకు అవగాహన కార్యక్రమం.
  • మంత్రి కేటీఆర్ చొరవతో కేటెక్స్ సంస్థతో ఇటీవల కుదిరిన ఒప్పందం.
  • స్వయం సహాయక బృంద (ఎస్.హెచ్.జీ) సభ్యులు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని GWMC మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అభిప్రాయపడ్డారు.
  • బుధవారం వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఆధ్వర్యంలో బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో ఎస్.హెచ్.జీ సంఘ సభ్యులు, టి.ఎల్.ఎఫ్ సభ్యులు, రిసోర్స్ పర్సన్స్(ఆర్.పి.లు), కమ్యూనిటీ ఆర్గనైజర్స్ (సి.ఓ)లకు ఏర్పాటు చేసిన అవగాహన జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ:

ముఖ్యమంత్రి కే.సి.ఆర్, పురపాలక, ఐ టి, టెక్స్టైల్స్ శాఖ మాత్యులు కే.టి.ఆర్.ల సహకారంతో గీసుకొండలో సుమారు 1200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం స్థలసేకరణ చేయడం జరిగిందని, పురపాలక, పరిశ్రమల శాఖ మాత్యులు కే.టి.ఆర్ ఒక విజన్, ఒక వినూత్న ఆలోచనతో దేశం లోని అతిపెద్ద మెగా టెక్స్ టైల్ పార్క్ కు శ్రీకారం చుట్టడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం కాకతీయ టెక్స్ టైల్ పార్క్ దేశంలోనే ఒక మోడల్ పార్క్ రా నిలువనుందని అన్నారు. కాకతీయ మేఘ టెక్స్ టైల్ పార్క్ కు సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కే.టి.ఆర్ గారి చొరవ తో కేరళ కు చెందిన కేటెక్స్ సంస్థ ప్రతినిధులతో హైద్రాబాద్ లో రూ.1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని, ఇందులో భాగంగా సుమారు 11వేల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని అన్నారు.

మెప్మా పరిధి లో పనిచేస్తున్న ఔత్సాహిక ఎస్.హెచ్.జీ.సభ్యులకు హైద్రాబాద్ నుండి టెక్స్టైల్స్, ఐ టి నిపుణులతో దీనిపై అవగహన కల్పించడం జరిగిందన్నారు. 3నెలల పాటు స్పిన్నింగ్, డైయింగ్, నిట్టింగ్, మ్యానుప్యాక్చరింగ్ లలో శిక్షణ అందజేస్తారని ఇట్టి బృహత్తర అవకాశాన్ని మహిళ సంఘ సభ్యులు వినియోగించుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలని అన్నారు. ఇందుకోసం అంతర్జాలం ద్వారా నైపుణ్య సహిత, నైపుణ్య రహిత విభాగాల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని మేయర్ అన్నారు.

రాష్ట్ర ఐ.టి.ఈ & ఇండస్ట్రీస్ అసోసియేట్ కన్సల్టెంట్ ఐశ్వర్య చకిలం మాట్లాడుతూ: వరంగల్ జిల్లాలోనే వస్త్ర నైపుణ్యం ఉందని, వాటిని వినియోగించుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చునని, ప్రభుత్వం తరపున మిషినరీ ద్వారా వస్త్ర ఉత్పత్తి ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని, నిజాం కాలం నుండి ఇక్కడ సంస్థలు ఉన్నప్పటికిని పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించలేవని, ప్రభుత్వం టెక్స్ టైల్ పాలసీ ద్వారా కొన్ని బెనిఫిట్స్ అందజేస్తూ కంపెనీ లను ఆహ్వానించి, ప్రోత్సహించడం జరుగుతుందని వస్త్ర ఉత్పత్తిలో ప్రపంచంలో నే 2 వ స్థానంలో కొనసాగుతున్న కేరళ కు చెందిన కేటెక్స్ సంస్థ 1964 వ సం. కేటెక్స్ గ్రూప్ పేరుతో కొచ్చి లో ప్రారంభించడం జరిగిందని, ప్రస్తుతం వీరు 12 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, బలమైన సాంకేతికత, టెక్స్ టైల్ రంగం లో దిగ్గజాలుగా పేరు గడించారని, సంస్థ తెలంగాణలో 70-80%మహిళలకు ఉపాధి కల్పించడానికి సుముఖంగా ఉన్నారని, గార్మెంట్రీ యందు ఉత్తమ శిక్షణ అందజేస్తారని ఇందుకోసం క్రమశిక్షణ అత్యవసరం అని అన్నారు.

టెక్స్ టైల్ OSD డాక్టర్. శాంత తౌటం మాట్లాడుతూ: 1200 ఎకరాల్లో పరిశ్రమను 3 రకాలుగా విభజించడం జరుగుతుందని మొదటి దశలో యు.కె.బేస్డ్ సాంకేతికత లో ప్లాస్టిక్ నుండి లాన్ తయారు చేయడం లాన్ నుండి వస్త్రాన్ని తయారు చేయడం జరుగుతుందని, రెండవ దశ లో దక్షిణ కొరియా కు చెందిన యంగ్ వన్ సంస్థ స్పిన్నింగ్ విధానం లో వస్త్రాన్ని తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుందని తెలిపారు. నైపుణ్యం సాధించి చేనేత పరిశ్రమ ద్వారా స్వయం ఉపాధి పొందాలని అన్నారు.*

టెక్స్ టైల్ డిజైనర్ దివ్యారెడ్డి మాట్లాడుతూ: ప్రపంచ దిగ్గజ సంస్థ కేటెక్స్ అని,నగరం లోని 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని, స్వయం సహాయక మహిళ బృంద సభ్యులు ఇట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, పని మొత్తం యంత్రాల సహాయం ద్వారా జరుగుతుందని, స్పిన్నింగ్ ప్రక్రియలో భాగం గా పత్తిని యంత్రాల ద్వారా వేరుచేయడం జరుగుతుందని, డైయింగ్ లో భాగం గా వస్త్రాలకు రంగులు అద్దడం జరుగుతుందని, నిట్టింగ్ లో అల్లిక పనులు ఉంటాయని శిక్షణ సమయం లో ఏకాగ్రతతో నేర్చుకుంటే పని సులభమౌతుందని శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ సి.హెచ్. నాగేశ్వర్, పి.డి.మెప్మా భద్రు నాయక్, టీ. ఎం.సి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.