ఈమె పద్దతిగా తన ఇంటి గుమ్మం ముందు ఫొటో దిగి ఫేస్బుక్లో షేర్ చేసింది, దాన్ని ఓ యాప్ సాయంతో క్షణాల్లో న్యూడ్ ఫొటోగా మార్చేసి అడల్ట్ ఫోరమ్‌లలో అగంతకులు పోస్ట్ చేశారు. మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే డీప్ ఫేక్స్ టెక్నాలజీ ఆధారంగా ఒక మహిళ చిన్న వీడియో క్లిప్‌ని తీసుకుని ఆమె పోర్న్ మూవీలో నటించినట్లు తయారు చెయ్యడం సులభమైపోయింది. ఫొటోల నైతే ఇంత ఈజీగా నగ్నంగా మార్చేయగలుగుతారు. అందుకే మహిళలు వ్యక్తిగతమైన ఫొటోలు , వీడియోలు ఫేస్బుక్, ఇన్‌స్టగ్రామ్ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలుపు తున్నారు…