ఈ రోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ.. వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకా రెడ్డి దారుణ హత్య ఘటన నేపథ్యంలో మహిళల రక్షణకు మేమున్నాము మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడూ తమ ధైర్యం కోల్పోవద్దని ఏ ఇబ్బంది ఉన్నా డయల్ 100 కు కాల్ చెయ్యండి మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఏ సమయంలో అయినా సరే పోలీసులు మీకు అండగా ఉంటామని ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేయాలని, మహిళలు ఎల్లప్పుడు అప్రమత్తతతో ఉండాలని సూచించారు. పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా నిఘా పెట్టినా.

ఎక్కడికక్కడ మహిళలపై వేధింపులు, అకృత్యాలు ఆగడం లేదుని, కొన్ని ప్రాంతాల్లో మహిళలు భయంతో పోలీసులను ఆశ్రయించకుండా దూరంగా ఉండిపోతున్న నేపథ్యంలో, అసలు అలాంటి సంఘటనలు బయటకు రావడం లేదుని, దీంతో బాధితులకు న్యాయం జరగడం లేదని మహిళలకు రక్షణ కలిగించడానికి పోలీసులు అహర్నిశలు పనిచేస్తారని, పోలీస్ శాఖ మహిళలకు భరోసా ఇస్తుందిని, ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు టోల్ ఫ్రీ నంబర్లను తమ ఫోన్ లో సేవ్ చేసుకోవాలని అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపినారు. అలాగే రాత్రివేళ ప్రయాణాల్లో మహిళలు, వృద్ధులు తమ వాహనాలు చెడిపోయినప్పుడు కానీ, ఇతర ఏ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ, తమ స్వంత వ్యక్తులు అందుబాటులో లేనప్పుడు కానీ , వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రివేళల్లో ఎక్కువగా ముప్పు పొంచి వుందనుకున్నప్పుడు డయల్ 100 కు గానీ , మెదక్ జిల్లా పోలీసు వాట్స్ ఆప్ నెంబర్ 7330671900 కానీ, మెదక్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లైనటువంటి 08452223533, 08452221667, లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

అంతే కాకుండా మెదక్ జిల్లా షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్ 6303923823 కు సమాచారం ఇచ్చినా వారు వెంటనే సాయం అందిస్తారని తెలిపారు. అలాగే మహిళలకు, బాలికలకు ఏదైనా ఇబ్బంది కలిగితే మెదక్ జిల్లా షీ టీమ్స్‌ మెయిల్ [email protected] కి మెయిల్ కూడా చేయవచ్చని తెలిపినారు, ఇలా వచ్చిన ఫిర్యాదులను షీ టీంలకు చెందిన పోలీసులు బృందం మఫ్టీలో సంచరిస్తూ నేరస్తులను ఆధారాలతో పట్టుకుంటున్నారని తెలిపారు. అలాగే మెదక్ జిల్లా షీ టీం ఫేస్బుక్ facebook_sheteammedakdistrict ల ద్వారా సమాచారం అందించాలని కూడా తెలిపినారు. తమ యొక్క వాహనాలు పాడైపోయినా తమకు సమాచారం అందించి పోలీసుల యొక్క సహాయం పొందాలని, అన్నివర్గాల ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ లకు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు, ఈ వాట్స్ ఆప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అత్యవసర సమయంలో ఫోన్‌ చేసి సాయం కోరవచ్చుని ఈ సందర్భంగా పేర్కొన్నారు…