{"source_sid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1599979894067","subsource":"done_button","uid":"A905236D-B52E-4185-97ED-E754469E94B4_1599921686947","source":"other","origin":"gallery"}

గుంటూరు జిల్లా పెదకూరపాడులో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎ్‌సఈబీ) స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు: పెదకూరపాడు ఎస్‌ఈబీ స్టేషన్‌ ఫరిదిలో ఉన్న లేమల్లెలో ఇటీవల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. మద్యం నిల్వపై సమాచారం అందించిన వ్యక్తి లేమల్లెలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మెన్‌గా గుర్తించారు. ఆయన మొబైల్‌ ఫోన్‌ కాల్‌డేటాను, వీడియోలను పరిశీలించారు. దానిలో అశ్లీల దృశ్యాలు, నీలిచిత్రాలకు సంబంధించిన వీడియోలను గుర్తించిన ఈఎస్‌ బాలకృష్ణన్‌ వాటిని సీడీలో కాపీ చేసి ఇవ్వమని ఎస్‌ఐ గీతను ఆదేశించారు. అటువంటి ఫోన్‌ను తనకెందుకు ఇచ్చారని ప్రశ్నించగా వేరే అర్థం వచ్చే విధంగా ఈఎస్‌ మాట్లాడినట్లు గీత ఆరోపించారు. రెండునెలల క్రితం కూడా ఆయన తనను వేధించినట్లు ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు.

అయినా వేధింపుల పర్వం కొనసాగుతుండటంతో మనస్తాపం చెందిన గీత గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఈబీ రాష్ట్ర కమిషనర్‌ వినీత్‌ బ్రిజిలాల్‌కు బాధితురాలి భర్త నగేష్‌ శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఈఎస్‌ బాలకృష్ణన్‌ను రాష్ట్ర ఎక్సైజ్‌ ఆఫీ్‌సకు సరెండర్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్‌ ఎస్పీ రమాదేవి, ఈఎస్‌ వివేక్‌, ఏఈఎస్‌ లావణ్యతో ఏర్పాటైన కమిటీ శనివారం గుంటూరులోని బాధితురాలు గీత ఇంటికి వెళ్లి విచారించింది.