రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అలైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ప్రేమించమని వేధించడం ఒప్పుకోకపోతే చంపేయడం చేస్తున్నారు. అలాగే కామాంధులు సైతం రెచ్చిపోతున్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక వార్త సంచలనంగా మారుతుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీసి అవి చూపించి కోరిక తీర్చాలంటూ వేధించిన ఘటన బయటపడింది.

జిల్లాలోని కామవరపుకోట మండలంలోని వీరంపాలెం గ్రామానికి చెందిన వివాహిత బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా కొందరు యువకులు రహస్యంగా సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశారు. ఆ తర్వాత నేరుగా ఆమె ఇంటికే వెళ్లి న్యూడ్ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టారు. కీచకుల వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు తడికలపూడి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తడికలపూడికి చెందిన శ్రీను, రాజాతో పాటు సమీపంలోని వేగివాడ గ్రామానికి చెందిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.