మాక్స్ కేర్ హాస్పటల్ లో ఎం జరుగుతుంది వైద్యమా ….? వ్యాపారమా …?

డబ్బుల కోసం నిండు ప్రాణాన్ని బలితీసుకున్న మాక్స్ కేర్ హాస్పటల్ డాక్టర్స్ ….!!

సీతారాంపురం నెక్కొండ మండలం కి చెందిన జక్కుల రమా అత్యవసర చికిత్సకోసం మాక్స్ కేర్ హాస్పటల్ కి తీసుకెళ్లారు ,, డిపాసిట్ 30000 చేపించుకున్నారు ,, 10 నిమిషాల తర్వాత 7౦.౦౦౦/- కట్టండి రోజు 3౦.౦౦౦/- బిల్ అవుతాది అని చెప్పరు ..

మాకు అంత స్తోమత లేదు మేము MGM హాస్పటల్ కి తీసుకెళతాం అని చెప్తే 1౦.౦౦౦/- రూపాయలు కట్టి తీసుకెళ్లమని పెషేంట్ ని పంపకుండ , చికిత్స చెయ్యకుండా ఆపారు టైం వెస్ట్ చేసి రమా ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు …!!

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు రమా బాడీ ని తీసుకెళ్లమని బాధితులు హాస్పటల్ ముందు ధర్నా చేస్తున్నారు…!!

బాధితులకు అండగా ధర్మారం గ్రామానికి చెందిన గోదాసి చిన్న ధర్నాలో పాల్గొన్నారు .. బాధితులకు న్యాయం జరిగే వరకు హాస్పటల్ ముందు ఇలాగె కూర్చుంటామని చెప్పారు.