హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఏఐసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఉన్నారు. ఈ సందర్బంగా దేవేందర్ గౌడ్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్‌లతో రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ముగ్గురిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.