ఓయో రూంలలో గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న నిందితులను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: మాదాపూర్‌లోని జైహింద్‌ ఎన్‌క్లేవ్‌ రహదారిలో ఓయో క్వాలియాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈనెల 20వ తేదీ రాత్రి పోలీసులు ఓయో రూంపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకురాళ్ళు, ఓ విటుడితో పాటు 5 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుండి మొబైల్‌ఫోన్స్‌ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.