హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలతోపాటు ఒక విటుడు, నిర్వాహకుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యప్ప సొసైటీలోని విజయలక్ష్మి సూపర్ మార్కెట్ మూడో అంతస్తులో గత కొన్ని నెలలుగా సురేందర్ రెడ్డి ఓయో రూమ్స్ నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు వ్యభిచారం గృహంపై పోలీసులు దాడి చేశారు. అనంతరం సురేందర్ రెడ్డితో పాటు ముగ్గురు యువతులు, కిషోర్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.