ఒకవైపు కరోనాతో పోరుతో విశ్రాంతి లేకుండా అనుక్షణం ప్రజల బాగోగుల పర్యావేక్షిస్తున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా కట్టడిలో భాగంగా వైద్యుల పనితీరుని పర్యవేక్షించడానికి వెళ్లిన కలెక్టర్ కి అక్కడ రోగికి రక్తం అవసరం అని తెలిసి క్షణం ఆలస్యం చేయకుండా రక్తదానం చేసి తన ఉదారతను చాటుకున్నారు.