ఈ రోజు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల దండుపల్లి గ్రామంలో నివసిస్తున్న ఒరిస్సాకు చెందిన దినసరి కూలీ అయినటువంటి శుభశ్రీ అనే మహిళ గర్భవతి గా ఉన్నందున తన ఆరోగ్యం బాగాలేదని, తన పరిస్థితిని గ్రామ ANM స్రవంతి గారికి తెలుపగా ఏ.ఎన్.ఎం స్రవంతి గారు లాక్డౌన్ కారణంగా ఎలాంటి వాహన సదుపాయాలు లేనందున తాను వెంటనే ఇట్టి విషయాన్ని వెంటనే మనోహరాబాద్ యెస్.ఐ శ్రీ.రాజు గారికి తెలుపింది,

వెంటనే స్పందించిన యెస్.ఐ గారు ఇట్టి సమాచారాన్ని తన పై అధికారులకు తెలిపి జాతీయ రహదారి పైన ఉండే హైవే అంబులెన్స్ అధికారులతో మాట్లాడి ఇక్కడి పరిస్థితీని వివరించి హైవే అంబులెన్స్ ని దండుపల్లి గ్రామానికి తీసుకువచ్చి. గర్భవతి అయినటువంటి శుభశ్రీ గారిని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లటం జరిగింది. ఈ సందర్బంగా శుభశ్రీ గారు తన పరిస్థితిని తెలిపిన వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటిన మనోహరాబాద్ యెస్.ఐ రాజు గారికి జిల్లా పోలిస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపినారు.