గత నెలలో అత్యాచారం, హత్యకు గురైన మానస కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని ఏకశిలా పార్క్ వద్ద దీక్ష చేస్తున్న మానస తల్లి స్వరూపను ప్రభుత్వ చీఫ్ విప్ పరామర్శించారు. నిందుతులకు చట్ట ప్రకారం కఠిన శిక్షిస్తామన్నారు.

మానస కుటుంబానికి న్యాయం చెస్తామని హామీ ఇచ్చారు. మహిళలపై లైంగిక వేధింపులకు గురిచేసిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునే విధంగా సహకరిస్తాను, వరంగల్ జిల్లాలో అత్యచారం, హత్య సంఘటనలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చే విధంగా చూస్తామని చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ తెలిపారు.