12 వ నుంచి నడిచే రైళ్లలో కరెంట్ బుకింగ్ టికెట్లు ఇవ్వరు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పించారు.
ఈ ప్రత్యేక రైళ్లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయి. జనరల్ బోగీలు ఉండవు. ఆర్డినరీ క్లాస్ రిజర్వేషన్ కూడాలేదు.

ఏడు రోజుల ముందుస్తు రిజర్వేషన్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ, తత్కాల్, కరెంట్ బుకింగ్ టికెట్లు జారీ చేయరు.ఐఆర్‌సీటీసీ ఏజెంట్ల ద్వారా టికెట్ల బుకింగ్‌కు అనుమతులు ఉండవు. టికెట్‌ను 24గంటల ముందుగా రద్దు చేసుకోవాలి. 50% రుసుము మాత్రమే తిరిగి చెల్లిస్తారు.