మసాజ్‌ సెంటర్‌ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ సెంటర్‌పై మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడిచేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఏఎస్‌రావునగర్‌ కేఎల్‌ఎం షాపింగ్‌మాల్‌ సమీపంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న గ్లోవిష్‌ మసాజ్‌ సెంటర్‌లో కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది.

మంగళవారం రాత్రి కష్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మసాజ్‌ సెంటర్‌ ముసుగులో పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు మహేశ్‌తో పాటు అస్సాంకు చెందిన ఓ మహిళ, మరో నలుగురు మహిళలను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించామన్నారు.