నటి మాధవీల వ్యాఖ్యలు ఎప్పుడూ ఆసక్తికంగానే ఉంటాయి. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పే మాధవీలత తాజాగా లాక్ డౌన్ లో జరిగే పెళ్లిళ్లపై వ్యాఖ్యలు చేసిందారామె.

లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో నిఖిల్, దిల్ రాజు స‌హా మ‌రికొంత మంది సినిమా వాళ్లు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మాధ‌వీల‌త త‌న‌దైన స్టైల్లో కామెంట్స్ చేసారు. మాస్కుల ముసుగులతో పెళ్లిళ్ళాలా ? ‘‘ముహూర్తం ళ్లీ రాదా ? పిల్ల దొరదనా ? లేక పిల్లోడు మారిపోతాడనా ? అలా మారిపోయే మ‌నుషుల‌తో. మార్చుకునే నిర్ణయాలతో బంధాలు ఎందుకు ? మాస్కుల ముసుగులో పెళ్లి అవ‌స‌ర‌మా? లాక్ డౌన్ అర్థం ఏంటో వీళ్లకు తెలుసా? కొన్నాళ్లు ఆగ‌లేని వాళ్లు అసలు సంసారాలు చేస్తారా?’’ అంటూ మాధవీలత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

ఇది నా అభిప్రాయం. నా భావాల‌ను చెప్పే హ‌క్కు నాకుంది అంటూ , మరోసారి తనదైన శైలిలో మెలికలాంటిది పెట్టి ఏండ్ చేసారు మాధవీలత..