వివాహం పేరుతో ఓ మహిళ మోసపోయింది. శోభనం రోజు రాత్రి భర్త దూరంగా ఉంటే ఒత్తిడిలో ఉన్నాడనుకుంది. హనీమూన్‌కని థాయిలాండ్ వెళ్లినా భర్తలో ఎలాంటి మార్పూ లేదు. మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో అసలు విషయం అర్థమైంది. మగతనం లేని వ్యక్తినిచ్చి పెళ్లి చేశారని, అదే విషయం ఇంటికొచ్చిన తర్వాత అత్తమామలకు చెప్పడంతో మా అబ్బాయినే అవమానిస్తావా అంటూ చేయిచేసుకున్నారు. చేసేది లేక భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లో జరిగింది. అహ్మదాబాద్ పరిధిలోని సైజ్‌పూర్-బోఘాకి చెందిన మహిళ(26) బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో రెండేళ్ల కిందట 2018 నవంబర్‌లో వివాహమైంది.

పెళ్లైన కొద్దిరోజులకి సంప్రదాయబద్దంగా ఇద్దరికీ శోభనం ఏర్పాటు చేశారు. అయితే ఆ రోజు ఆమెతో శారీరకంగా దగ్గరయ్యేందుకు భర్త ఆసక్తి చూపలేదు. పెళ్లి పనుల కారణంగా ఒత్తిడిలో ఉండి ఉంటాడని అనుకుని సర్దుకుపోయింది. హనీమూన్‌ కోసమని కొత్త జంట థాయిలాండ్ వెళ్లింది. అక్కడ కూడా భర్త ఆమెకు దూరంగానే ఉంటున్నాడు. తనే చొరవ తీసుకుని దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి మందులు వాడినా ఎలాంటి మార్పూ లేకపోవడంతో ఆమెకు అసలు విషయం అవగతమైంది.

మగతనం లేని వ్యక్తిని తనకిచ్చి కట్టబెట్టారని తెలిసి ఇంటికొచ్చిన తర్వాత అత్తమామలను నిలదీసింది. అయితే తన చిన్నవయస్సులో ప్రమాదం జరిగిందని, తన ప్రైవేట్ పార్ట్స్‌కి దెబ్బలు తగిలాయని భర్త చెప్పాడు. అందువల్ల ఇలా జరిగి ఉంటుందని ఒప్పుకోవడంతో ఆమె అత్తమామలను ప్రశ్నించింది. ఎందుకు మోసం చేశారంటూ నిలదీయడంతో ఆమెను కొట్టి పుట్టింట్లో వదిలేశారు. ఈ మేరకు తనను మోసం చేసి నపుంసకుడితో పెళ్లి చేశారంటూ భార్య మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.