• ఎన్నాళ్ళ నుండి చెట్లు పై మీకు మక్కువ ఎందుకు మొక్కలు నాటాలి అనిపించింది – హరీశ్ రావు
  • నా ఐదేళ్ల ఏటా నుండే వనం పై మక్కువ, చిన్న అగ్గిపుల్ల కూడా వచ్చేది మొక్క నుండే, మొక్కే లేకుంటే మానవ మనుగడ లేనెట్టే: వనజీవి రామయ్య.
  • అల్ఫాహారం చేస్తూ, వనజీవి రామయ్య తోముచ్చటించిన మంత్రి హరీష్ రావు గారు ” సిద్దిపేట కు వచ్చిన పద్మశ్రీ వనజీవి రామయ్య తో మంత్రి హరీష్ రావు తన నివాసంలో అల్ఫాహారం చేస్తూ కాసేపు ముచ్చటించారు:
  • “ఎన్నాళ్లుగా చేస్తున్నారు మొక్కలు నాటడం అని , ఎందుకు చేయాలి అనిపించింది ? అని మంత్రి హరీష్ రావు గారు రామయ్య ను అడిగారు..

అందుకు సమాదానము ఇస్తూ: నా ఐదవ ఏటా నుండే ఈ వనం అంటే మక్కువ అప్పటి నుండే మొక్కలు నాటుతున్న ” ఏ మనిషికి అయిన మనుగడ చెట్లే , ఒక చిన్న అగ్గిపుల్ల తో ఎంతో అగ్ని ని సృష్టించవచ్చు కానీ ఆ అగ్గి పుల్ల కూడా వచ్చేది మొక్క నుండే అని అన్నారు. మొక్క నుండి పూలు, పండ్లు, మంచి ఆక్సిజన్ , ఔషధాలు ఇలా ఎన్నో వస్తాయి అని చెప్పు కుంటు వచ్చారు. ” మరి మీ బ్రతుకు దేరువు ఏంటి.! అని మంత్రి అడుగగా, వ్యవసాయం చేస్తూ కొంత నష్టం జరిగింది , ఇప్పుడు కొడుకు చేసుకుంటున్నడు. ఇప్పటి వరకు కోటి పైన మొక్కలు నాటిన, సీడ్ తో మూడు కోట్ల మొక్కలు నాటలి అని సంకల్పం పెట్టికున్న, చెట్టు కన్నతల్లి లాంటింది.చేపను బయటకు తీయడానికి గాలం వేసినట్టు. భూమిలోని పండ్లను బయటికి తీయడానికి మొక్క నాటలి. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం పరుగులు తీస్తోందని చెప్పారు, మీరు ఈ సమాజానికి గొప్ప ఆదర్శప్రాయులు అని మంత్రి వారితో చెప్పుకొచ్చారు. వనజీవి రామయ్య గారి జీవితం, ఆయన మొక్కలు పై మక్కువ, చెట్లు ఎలా పెంచుతున్నారు అనే విషయాన్ని ప్రజాప్రతినిధులు అందరూ వినాలి, తెలుసు కోవాలి అని మంత్రి హరీష్ రావు గారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు సూచించారు.