కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లిపాలెం వద్ద లారీ-ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులతో పాటుగా స్కూల్క్‌కు వెళ్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు. మరోవైపు ప్రమాదంలో లారీ కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.