కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చిట్యాల క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, వాహనాలు వేగంగా నడపవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్సై వాహనదారులను హెచ్చరించారు.