{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1593796922450","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1593796794429","source":"share_action_sheet","origin":"unknown"}

ములుగు: మండలంలోని జాకారం గ్రామానికి చెందిన రాసమల్ల శివాజీ కూతురు శ్రీనిత గురువారం రాత్రి 10 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి అన్నం తిని పడుకున్నారు. రాత్రి 2.00 గంటలకు శివాజీ భార్య స్వప్న మూత్రానికి లేవగా మంచంలో శ్రీనిత లేదు. చుట్టు ప్రక్కల బంధువుల ఇండ్లలో అంతట వెతికి, ఎక్కడ ఆచూకీ దొరకక పోయేసరికి శుక్రవారం ములుగు పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా ములుగు ఎస్సై బండారి రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.