పేదలకు ప్రజలకు అండగా ఉండి సేవ చేస్తానని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా కార్యదర్శి, ఎమ్మెల్యే ధనసరి అనసూయ అన్నారు. ఈ మేరకు మండలంలోని కోయగూడెంలో శనివారం ఎమ్మెల్యే సీతక్క దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తానని, నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. మనం సంపాదించే రూపాయిలో కొంతమేరకు పేద వాళ్లకు సహాయం చేయాలనీ, మంచి మనస్సు తో సహాయం చేసే వాళ్ళు ముందుకు రావాలని సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో పిట్టల రమేష్ , కారం సతీష్, కారంశ్యామల, రామయ్య , జోడు శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.