ములుగు మండలంలోని కాశిందేవిపేట గ్రామ శివారులో అంకన్న గూడెం వెళ్లే ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం బైక్ ను డీ కొట్టింది‌. ఈ సంఘటనలో బైక్ పై ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…