పవిత్రమైన బక్రీద్ ఇద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి, సోదరులకు జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐపిఎస్. గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.పి. గారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ పవిత్రతకు , త్యాగానికి, ఐక్యతకు, నిదర్శనమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాధి నివారణకు విధించిన లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ ఇంటిలోనే కుటుంబ సభ్యులతో కలసి ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. మరియు ముస్లిం సహోదరులు ఈ పవిత్ర బక్రీద్ పండుగ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో పోలీసుల సూచనలు సలహాలు పాటించి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో ఈద్గా వద్ద ప్రార్థనలకు అనుమతి లేదు అని, ప్రార్థనలు చేసిన వారు చేతులు కలపడం, అలింగనం, చేసుకోకుండా మజీద్ నిర్వాహకులు ముస్లిం పెద్దలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.