మండలం మేడారంలో ఫిబ్రవరిలో జరుగు మహా జాతరకు భక్తుల సౌకర్యార్ధం మేడారం ఏండోమెంట్ కార్యాలయం ఆవరణలో 19 లక్షల విలువ చేసే సెప్టిక్ ట్యాంకు, డ్రైనేజి పనులను ఈఓ రాజేందర్ సోమవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మేడారం లో పారిశుద్ధ్యలోపం లేకుండా పటిష్టమైన డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వనదేవతలను దర్శించుకుంటానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం నిర్మించుతున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 5నుంచి 8వరకు జరుగు మేడారం మహా జాతరకు వచ్చు భక్తులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు, కాంట్రాక్టర్లు, ఏండోమెంట్ సిబ్బంది క్రాంతి, రాజేశ్వర్ రావు, మధు, రమాదేవి వీరన్న, కిషన్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.