ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగనున్న మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వనదేవతల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండడంతో ఆర్టీసీ కూడా వీలైనంత ఎక్కువ రూట్లలో బస్సులను నడపాలిన నిర్ణయించింది. మొత్తం 23 లక్షల మంది భక్తులను మేడారం చేరవేసేందుకు టీఆఎస్‌ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.

ఇందులో భాగంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఆర్టీసీ రీజినల్ నుంచి 4 వేల బస్సులు నడుపుతామని ఇప్పటికే ప్రకటించిన ఆర్టీసీ ఈ సారి 12,500 మంది అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపింది. మేడారం బస్‌స్టేషన్‌ వద్ద సీసీ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తామని వివరించారు. ఇక వివిధ ప్రాంతాల రాష్ట్రంలోని నలు మూలల నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే బస్సు ఛార్జీలను ఆర్టీసీ ఫైనల్ చేసింది. హైదరాబాద్‌ నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులకు రూ. 440, జనగామ నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులకు రూ. 280, మహబూబాబాద్‌ నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులకు రూ.270, కాళేశ్వరం నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులకు రూ.260, వరంగల్‌ నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులకు 190 రూపాయల బస్సు ఛార్జీలుగా నిర్ణయిచినట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.