వరంగల్ జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కుటుంబ సమేతంగా మంగళవారం మేడారం సందర్శించి, అమ్మవార్ల దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు డోలు వాయిద్యాలతో తల్లుల దర్శనం చేయించారు. మేడారం జాతర ఈవో రాజేంద్రం వారికి శాలువా కప్పి సన్మానించారు.